టాలీవుడ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో టాలీవుడ్ యాంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది.. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకి చేరుకుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు దర్శకుడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నాడు. కుటుంబం అంటే ఒక కప్పు కింద కొంతమంది కలిసి ఉండటం కాదు .. ఒకరి మనసులో ఒకరు ఉండటం. అనుబంధాల కోవెలే అసలైన కుటుంబం అని చాటిచెప్పే కథ ఇది. ఈ సినిమాలో తేజూకి తాత పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, తేజూకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
previous article
జిమ్ లో కసరత్తులు చేస్తున్న చిరు…
next article
పూజా హెగ్డే విహారయాత్ర…..
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment