టీజర్‌ వచ్చేది ఎప్పుడంటే…?

టాలీవుడ్ యాంగ్ హీరో ఉప్పలపాటి ప్రభాస్ రాజు ప్రస్తుతం నటిస్తున్నసినిమా ‘సాహో’. తెలుగులో ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం “బాహుబలి – ది బిగినింగ్ ” తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూళ్లు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన సినిమా. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో సాహో అను అభిమానుల ముందుకు తెస్తున్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ సుందరి శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు.

Image result for prabhas

ఈ సినిమా 2019 లో విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి టీజర్‌ సిద్ధమైంది. దీన్ని ఈనెల 13న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్‌ పోస్టర్‌ను విడుదల చేసారు సినిమా యూనిట్. ‘జూన్‌ 13న టీజర్‌తో ‘సాహో’ ప్రపంచంలో అడుగుపెట్టండి. జూన్‌ 14 నుంచి థియేటర్‌లో టీజర్‌ను అనుభూతి చెందండి’ అని ట్వీట్‌ చేశారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆగస్టు 15న సినిమాను విడుదల కాబోతోన్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘సాహో’కు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ యాక్షన్‌ చిత్రంగా దీన్ని నిర్మిస్తోంది. ఇందులో వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం తో మంచి అంచనాలు అందరిలో ఉన్నాయి.

Leave a Response