గాయపడా నాగ శౌర్య…

జూనియర్ హీరో నాగ శౌర్య ఆయన మొదటి పాత్రలో నటించే ముందు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలనుకున్నాడు. అప్పుడు ఆయన వారాహి చలన చిత్రం ద్వారా ప్రకటనను చూశాడు. ఆ ప్రకటనలో అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న శృంగార హాస్య చిత్రం ఊహలు గుసగుసలాడే గూర్చి ఉంది. ఆయన ఆ తన ప్రొఫైల్ ను పంపించాడు. ఆయనకు ఆశలు లేనప్పటికి ఆయన అందులోని ముఖ్యపాత్ర కోసం ఎంపిక అయ్యాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో పనిచేస్తున్నప్పుడే ఆయన “చందమామ కథలు” చిత్రానికి ఎంపికయ్యాడు. ఆ చిత్రం మొదట విడుదల అయ్యింది. ఊహలు గుసగుసలాడే విడుదలైన రెండు మాసాల తరువాత ఆయన కమర్షియల్ విజయాన్ని సాధించాడు.విశ్లేషకులు ఆయన హాస్యసన్నివేశాలకు సరిపోతాడని అన్నారు. వారు తరువాత సినిమాలకు కచ్చితమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఆయన మూడవ చిత్రం దిక్కులు చూడకు రామయ్య కూడా శృంగార హాస్య చిత్రం. ఇది త్రిముఖ ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో తండ్రి మరియు తనయుడు ఒకే అమ్మాయితో ప్రేమలో పడటం విశేషం. “నాగ శౌర్య కొత్త నటులలో ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు” అని హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. ఆ సంవత్సరంలో శౌర్య యొక్క చివరి చిత్రం “లక్ష్మీ రావే మా ఇంటికి”. ఆయన తరువాత చిత్రం 2015లో విడుదలైన “జాదూగాడు”. తరువాత “అబ్బాయితో అమ్మాయి” చిత్రంలో నటించాడు. 2016 లో ఆయన నీహారిక కొణిదెలతో కలసి ‎గొట్టిముక్కల వెంకట రామరాజు దర్శకత్వంలో ఒక మనసు చిత్రంలో నటించాడు. తరువాత కళ్యాణ వైభోగమే సినిమాలో నటించాడు. ప్రస్తుతం విశాఖలోని అరిలోవా ప్రాంతంలో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రముఖ హీరో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగిన విషయం మన అందరికి తెలిసిందే. వైద్య చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న నాగశౌర్యను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పరామర్శించారు. హైదరాబాద్ లోని నాగశౌర్య నివాసానికి ఈరోజు వెళ్లారు. రాఘవేంద్రరావుతో పాటు రచయిత బీవీఎస్ రవి కూడా ఉన్నారు. నాగశౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వాళ్లిద్దరూ ఆకాంక్షించారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ నాగశౌర్యను ఇరవై ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఇక సినిమా విషయానికి వస్తే కొంతకాలం గ్యాప్ ఇచ్చినటే.

Leave a Response