టాలీవుడ్ జూనియర్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ ‘రాక్షసుడు’ సినిమాను రూపొందిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.
స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి .. వాళ్లపై అత్యాచారం చేసి హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాలతో ఈ టీజర్ కొనసాగింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 18వ తేదీన విడుదల చేయనున్నారు. ‘సీత’ ఫలితంతో నిరాశ చెందిన బెల్లంకొండకి ఈ సినిమా ఊరట కలిగిస్తుందేమో చూడాలి.