కొత్త అవతారంతో వస్తున్న సమంత…

టాలీవుడ్ హీరోయిన్ గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమంత మరో సరికొత్త అవతారంతో అభిమానుల ముందుకు వస్తునఃది. ఒకవైపు నటిస్తూనే నిర్మాతగా సినీ నిర్మాణం కూడా చేపట్టనుందట. ప్రస్తుతం 96 రీమేక్‌లో శర్వానంద్‌కు జోడీగా నటిస్తున్న సమంత త్వరలో నిర్మాణ సంస్థను ప్రారంభించనుందని తెలుస్తోంది. కొత్త ట్యాలెంట్‌కు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సమంత ఈ నిర్ణయం తీసుకుందట.తన బ్యానర్‌పై కొత్త దర్శకులతో చిన్న సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించనుందట. అయితే సమంత బ్యానర్ ఎప్పుడు మొదలవుతుంది, తను నిర్మించబోయే తొలి సినిమా ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌, మనం ఎంటర్‌టై‌న్‌మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలు ఉన్నాయి. సమంత కూడా ఒక బ్యానర్‌ను స్థాపిస్తే ఆ ఫ్యామిలీ నుంచి ఇది మూడో నిర్మాణ సంస్థ అవుతుంది.

Leave a Response