అగ్ర కథానాయిక సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను సమంత ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌కు సిద్ధం కండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్లో సమంత.. నా కుమారుడు, మనవడు, బెస్ట్ ఫ్రెండ్ అని రావు రమేశ్, తేజ, రాజేంద్రప్రసాద్‌లను చూపించడం ఆకట్టుకుంటోంది. ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు, తొలి లిరికల్ పాటకు విశేషమైన స్పందన లభించింది. జులై 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
previous article
సప్తగిరి హీరోగా మరో సినిమా …
next article
హైదరాబాదులో ‘వెంకీమామ’
Related Posts
- /No Comment
వరుణ్ జోబిలొంచి శ్రీముఖి డబ్బులు దొంగిలించింది
- /No Comment