ఆస్తి కోసం ఆరు హత్యలు చేసిన మహిళా..!

కేరళలోని కోజికోడ్ లో 2002 నుంచి 2016 వరకూ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించగా చివరి మరణాల తరువాత అనుమానం వచ్చిన పోలీసులు నమ్మలేని నిజాలను వెలికితీశారు. ఆస్తి కోసం ఇంటి కోడలు జూలీ, తన రెండో భర్త షాజుతో కలిసి ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చిందని తేల్చారు.2002లో తొలి హత్య జరిగినప్పుడు దాన్ని జోలీ కుటుంబీకులు సాధారణ మరణంగానే భావించారు. జోలీ అత్త అన్నమ్మ థామస్ అప్పట్లో కుప్పకూలి మరణించింది. ఆపై ఆరేళ్లకు ఆమె భర్త టామ్ థామస్ గుండె విఫలమై మరణించాడు. వారి కుమారుడు జోలీ భర్త రాయ్ థామస్ 2011లో ఇదే విధంగా మరణించగా, పోస్టుమార్టంలో విషపు ఆనవాళ్లు కనిపించాయి. 2014లో అన్నమ్మ థామస్ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించగా, 2016లో అల్ఫాన్సా అనే రెండేళ్ల చిన్నారి, ఆపై నెలల వ్యవధిలో ఆమె తల్లి సిల్లీ మరణించారు. ఆస్తిని తన పేరిట బదలాయించుకోవాలని భావించిన జోలీ మామ టామ్ పై ఒత్తిడిని పెంచిందని, అయితే యూఎస్ లో ఉన్న టామ్ చిన్న కుమారుడు మోజో తనకు వచ్చిన అనుమానంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది.

Tags:familymurderproperty

Leave a Response