యువ హీరో నితిన్ స్పీడ్ పెంచారు, ఇప్పుడు మూడు సినిమాలను ఒకే సరి లైన్లో పెట్టారు. ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్నాయి. ఇందులో వెంకీ కుడుముల డైరెక్షన్ రూపొందబోయే భీష్మ సినిమా ఒకటి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది. మూడో సినిమా చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ మరో సినిమా రూపొందనుంది. భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందబోయే ఈ చిత్రంలో నితిన్ సరసన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాలో కన్ను కొట్టడం ద్వారా ప్రియా ప్రకాశ్ రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్‌గా పేరు సంపాదించుకుంది. వెంటనే పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా వద్దనుకున్న ఈ అమ్మడుకి, ఓరు ఆధార్ లవ్ ఫెయిల్యూర్ నిరాశనే మిగిల్సింది. మరిప్పుడు మలయాళ భామ నితిన్ సినిమాలో నటించనుందనే వార్తల్లో నిజమెంతో తెలియాలంటే వేచి చూడక తప్పేలాలేదు.