ఏపీ కి నరేంద్ర మోడీ …మళ్ళీ ఏ వరం ఇవ్వబోతున్నాడో …?

రెండో సారి భారత్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఈ రోజు మన ఏపీ తిరుమలకు రానున్నారు. ఆయనను ఏపీ సీఎం జగన్ రేణిగుంట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలుకుతారు. అక్కడ నుండి ఏపీ సీఎం జగన్ , ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తిరుమల వస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ రేపు శ్రీలంక నుంచి రేణిగుంట చేరుకుంటారు. అనంతరం మోదీ బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆపై సాయంత్రం 6 గంటలకు మోదీ, జగన్ శ్రీవారి దర్శనం చేసుకుంటారు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీ హస్తిన పయనం అవుతారు. కాగా, కొత్త క్యాబినెట్ తో సరికొత్తగా పాలన మొదలుపెట్టనున్న ఆయన తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకోనున్నారు.

Leave a Response