ఇటీవల విడుదలైన ‘అర్జున్ పాటియాలా’లో మెరుపులా మెరిసిన సన్నీలియోనీ ప్రస్తుతం ‘స్ల్పిట్స్ విల్లా సీజన్ 12’ రియాల్టీ షోతో బిజీగా ఉన్నారు. హర్రర్, కామెడీ నేపథ్యంతో సాగే ‘కోకాకోలా’ సినిమాలో కూడా నటించనున్నారు. క్యాన్సర్ బాధితుల కోసం తనవంతు సాయం అందించాలని ముందుకు వచ్చారు. ‘క్యాన్సర్ బాధితుల కోసం నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను, ఇందుకోసం పెయింటింగ్స్ వేసి, వాటిని వేలానికి ఉంచుతున్నాను. అలా వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితులకు అందజేస్తాను. పెయింటింగ్లు వేసేటప్పుడే క్యాన్సర్ బాధితుల కోసం ఆలోచించాను. మీరు కూడా క్యాన్సర్ బాధితుల కోసం తోచిన సాయం చేయండి’ అంటూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కొన్ని పెయింటింగ్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
- /
- /admin
- /No Comment
- /55 views
- /cancer patientdonatepaintingsunnyleone
వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితులకు అందజేస్తాను..!
Tags:cancer patientdonatepaintingsunnyleone
previous article
ఆస్తి కోసం ఆరు హత్యలు చేసిన మహిళా..!
Related Posts
- /No Comment
నవదీప్ సన్నీలియోన్ రొమాన్స్ సూపర్..!
- /
- /No Comment