టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి..!

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సైదిరెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. మరోసారి ఆయనకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Leave a Response