బుల్లితెర యాంగ్ హీరో ప్రదీప్ మాచిరాజు. తన మాటలతో అందరాని తన వైపు తిప్పుకున్నాడు మన అల్లరి బుల్లోడు. ఇక అసలు విషయానికి వస్తే… ఒక టీవీ వ్యాఖ్యాత. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. జీ తెలుగు లో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం ఈ టీవీ లో ప్రసారం అవుతున్న ఢీ షోకి యాంకర్ గా చేశాడు. కొన్ని రోజుల నుంచి స్క్రీన్ కు దూరం అయిన సంగతి అందరికి తెలిసిందే. ప్రదీప్ కనిపించకపోవడం పై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై యాంకర్ రవి స్పందిస్తూ ప్రదీప్ అనారోగ్యం తో బాధపెడుతున్నాడు తొందరలోనే మళ్ళీ కోలుకుని వస్తాడంటూ చెప్పుకొచ్చాడు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ప్రదీప్ ఎక్కడున్నాడని తన అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడా లేక సినిమాల్లో ఛాన్స్ లు రావటంతో గ్యాప్ తీసుకుంటున్నాడా అని నెట్టింట్లో తెగ చర్చించుకుంటున్నారు. ప్రదీప్ రాబోయే సినిమాలో తన లుక్ ని పూర్తిగా చేంజ్ చేసే పనిలో ఉన్నాడని, అందుకే బుల్లితెర కు దూరంగా ఉంటున్నాడని అభిమానులు అనుకుంటుంటే మరి కొంతమంది ప్రదీప్ అనారోగ్యంతోనే బాధపడుతున్నాడు అంటూ టాలీవుడ్ లో గుసగుస వినిపిస్తున్నాయి.
previous article
నాగశౌర్య కి ఫిదా అయిన సమంత…
next article
తప్పుడు కేసులు పెడుతూన వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment