అక్టోబర్ 21న పోలింగ్..!

మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో పాటు తెలంగాణ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, గుజరాత్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో హుజూర్ నగర్ కు కూడా ఉపఎన్నిక జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ నెల 28 చివరి తేదీ వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 24న ఫలితాలు విడుదల కానున్నాయి.

Leave a Response