సీఎం అయ్యాక ఊసరవెల్లి స్థాయిలో రంగులు మార్చేశారు…

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తమ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యం విస్మరించలేనిదని, ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోరాడారని, టీఆర్ఎస్ పార్టీ చీఫ్ హోదాలో ఆర్టీసీ కార్మికులను పోరాటాన్ని మీరు కూడా అభినందించారని, తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మార్పు తెస్తానని హామీ ఇచ్చారని కేసీఆర్ కు గుర్తు చేశారు. “ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేసిన వారిలో మీరు కూడా ఉన్నారు. కానీ మీరు పాలన చేపట్టాక ఆర్టీసీని పట్టించుకోవడం మానేశారు. సీఎం అయ్యాక ఊసరవెల్లి స్థాయిలో రంగులు మార్చేశారు” అని అన్నారు.

Tags:kcrrevanth reddystiketsrtc

Leave a Response