ప్రజలను మోసం చేసేందుకే అయ్యప్ప మాల..!

Ayyappa mala for cheating people ..!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పోలీసులు కీడు పేరుతో అమాయకులను భయపెట్టి ఆపై పూజల పేరుతో వారిని నిలువునా ముంచుతున్న ముఠాని కటకటాల వెనక్కి పంపారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన వారా సాంబయ్య, వారా బాజి, బూతుల సాంబయ్యలు అయ్యప్పమాల ధరించారు. త మూడు రోజులుగా వీరులపాడు మండలంలో తిరుగుతున్న వీరు.. తమకు తారసపడిన ఆయా వ్యక్తులను బెదిరిస్తూ, మీ కుటుంబ సభ్యులు త్వరలో అనారోగ్యం బారినపడతారని, కీడు జరుగుతుందని చెప్పారు. కీడు పోవాలంటే పూజలు చేయాలని చెప్పి వేల రూపాయలు కాజేయడం మొదలెట్టారు. ఈ ముఠా గద్దె రేణుక ఇంటికి వెళ్లింది. ఆమె పెద్ద కుమార్తె మరో రెండు వారాల్లో అనారోగ్యం బారిన పడుతుందని, పూజలు చేయాలని నమ్మించి రూ. 18 వేల నగదు, బంగారు నగలతో ఉడాయించింది. రేణుక భర్త నరసింహారావు వారిని పట్టుకునేందుకు బయలుదేరాడు. ఎట్టకేలకు మునగపాడు వద్ద చిక్కారు. తమను పట్టుకునేందుకు వస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన ముఠా.. రేణుక నుంచి తీసుకున్న సొమ్మును రోడ్డుపై విసిరేసి, బైక్‌లు వదిలి పరారయ్యేందుకు ప్రయత్నించారు.గ్రామస్థులు చాకచక్యంగా వ్యవహరించడంతో పట్టుబడ్డారు.ప్రజలను మోసం చేసేందుకే తాము అయ్యప్ప మాల ధరించినట్టు విచారణలో ముఠా సభ్యులు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Response