అక్రమాస్తుల కేసులో జగన్ న్యాయస్థానానికి హాజరుకాలేదు.

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) న్యాయస్థానానికి హాజరవుతారన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయన కోర్టులో విచారణకు హాజరుకాలేదు. ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరడంతో ఆయన చేసుకున్న అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది.అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. కాగా, ఈ కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై తనకు మినహాయింపును ఇవ్వాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ ఇటీవలే న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించడంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

Leave a Response