అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా పారిస్ లో..

టాలీవుడ్ యాంగ్ హీరో అల్లు అర్జున్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అభిమానుల ముందుకు వస్తున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘సామజ వర గమన’ పాట ప్రేక్షకులను అలరించింది. సామాజిక మాధ్యమాలలో రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీత దర్శకుడు తమన్ అందించిన బాణీలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఇక ఈ ‘సామజ వర గమన’ సాంగ్ ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది.

Image result for ala vaikunta puram

Leave a Response